నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. వేల్పూరు క్రాస్ రోడ్డు వద్ద రోడ్డుపై లారీ ఆగివుంది. జగిత్యాల నుంచి ఇద్దరు వ్యక్తులు ఆర్మూర్ వైలుతున్న ఆల్టో కారు ఢీ కొట్టంది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. కారులో వున్న ఇద్దరు ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నవారు కాపాడండి అంటూ కేకలు వేసినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.…
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 50 వేలమందికి పైగానే దర్శనాలు చేసుకుంటున్నారు. దీంతో ఘాట్ రోడ్లు భక్తుల వాహనాలతో బిజీఅయిపోతున్నాయి. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. హఠాత్తుగా ఓ కారులో మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే ఆ కారు అగ్నికి ఆహుతైంది. కర్నూలుకు చెందిన భక్తులు కారులో తిరుమల కొండపైకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రెండో ఘాట్ రోడ్డు ఆఖరి మలుపు వద్ద కారులో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.…