ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రూ.10 కోట్ల విలువైన బంగారంతో ఓ కారు డ్రైవర్ ఉడాయించాడు. నగల వ్యాపారి రోడ్డు పక్కన టీ తాగుతుండగా.. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఒక్కసారిగా పరారయ్యాడు. కారును నందిగామ దగ్గర మునగచెర్ల వద్ద వదిలిన డ్రైవర్.. బంగారంతో పరారయ్యాడు. వ్యాపారి జగ్గయ్యపేట మండలం చిలకలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ప్రత్యేక బృందాలు డ్రైవర్ కోసం గాలిస్తున్నాయి. వివరాల ప్రకారం… హైదరాబాద్ బీఎన్‌ఆర్ జ్యుయలరీ నుంచి విజయవాడ డెలివరీకి వ్యాపారి కిషన్…