Car Driver: 10 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించిన కారు డ్రైవర్!
- జగ్గయ్యపేటలో ఊహించని ఘటన
- 7 కిలోల బంగారంతో పారిపోయిన డ్రైవర్
- ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రూ.10 కోట్ల విలువైన బంగారంతో ఓ కారు డ్రైవర్ ఉడాయించాడు. నగల వ్యాపారి రోడ్డు పక్కన టీ తాగుతుండగా.. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఒక్కసారిగా పరారయ్యాడు. కారును నందిగామ దగ్గర మునగచెర్ల వద్ద వదిలిన డ్రైవర్.. బంగారంతో పరారయ్యాడు. వ్యాపారి జగ్గయ్యపేట మండలం చిలకలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ప్రత్యేక బృందాలు డ్రైవర్ కోసం గాలిస్తున్నాయి.
వివరాల ప్రకారం… హైదరాబాద్ బీఎన్‌ఆర్ జ్యుయలరీ నుంచి విజయవాడ డెలివరీకి వ్యాపారి కిషన్ లాల్ సహా ముగ్గురు వ్యక్తులు బయల్దేదారు. జగ్గయ్యపేట ఆటోనగర్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగేందుకు డ్రైవరు జితేష్ కారు ఆపాడు. వ్యాపారి కిషన్ లాల్ సహా మరో వ్యక్తి టీ తాగుతుండగా.. డ్రైవరు జితేష్ ఇదే అదనుగా భావించాడు. కారులో ఉన్న బంగారంతో పరారయ్యాడు. ఇది చూసిన వ్యాపారి గట్టిగా కేకలు వేశాడు. వెంటనే జగ్గయ్యపేట మండలం చిలకలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read
డ్రైవర్ జితేష్ కారును నందిగామలోని మునగచెర్ల వద్ద వదిలి.. బంగారంతో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కారులో 7 కిలోల బంగారం ఉన్నట్లు వ్యాపారి కిషన్ లాల్ పోలీసులకు తెలిపాడు. బంగారం విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
- Tags
- ap
- car driver
- Car Driver Gold
- Gold
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?