నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద అదుపుతప్పి రోడ్డుపన్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది కారు.. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.. ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు.. మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వద్ద కారు భీభత్సం సృష్టించింది..
దేశ వ్యాప్తంగా పూణె ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఓ బాలుడు మద్యం సేవించి వేగంగా కారు నడిపి ఇద్దరు టెకీల ప్రాణాలను బలి తీసుకున్న ఘటనను ఇంకా మరువక ముందే మరో ఘోరం జరిగింది.