కెనడాలో ఉన్న మిగిలిన దౌత్యవేత్తలపై తాము ప్రత్యేక నిఘా ఉంచామంటూ భారత్‌పై బురద జల్లే ప్రక్రియను ఆమె కొనసాగించారు. అంతటితో ఆగకుండా భారత్‌ను రష్యాతో పోలుస్తూ అక్కసును వెళ్లగక్కింది. భారత దౌత్య వేత్తలు వియన్నా కన్వెన్షన్ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదని మెలానీ జోలీ కామెంట్స్ చేసింది.