Tirumala: మరో 35 రోజుల్లో నూతన సంవత్సరం వచ్చేస్తోంది. ప్రజలందరూ 2022కు వీడ్కోలు పలికి 2023కు స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. కావాల్సిన భక్తులకు ఆన్‌లైన్‌లో వీటిని అందజేసేలా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వాళ్లకు పోస్టు ద్వారా పంపుతామని టీటీడీ వెల్లడించింది. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో ‘పబ్లికేషన్స్’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి డెబిట్‌కార్డు, క్రెడిట్ కార్డుల…