Elon musk: ట్విట్టర్ కొనుగోలుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మనసు మారింది. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి మస్క్ మళ్లీ సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్ల చొప్పున 4,400 కోట్ల డాలర్లకు కొనేందుకు అంగీకరించినట్టు సమాచారం.