రాజమండ్రి రూరల్ సీటుపై టీడీపీ వర్సెస్ జనసేన పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారి టికెట్ తనకేనంటూ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చెబుతుండగా.. కాదు తనకు పవన్ కల్యాణ్ మాట ఇచ్చారని జనసేన నేత కందుల దుర్గేష్ పేర్కొంటున్నారు. ఇక, రాజమండ్రిలో పవన్ టూర్ తర్వాత రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన పార్టీల మధ్య రచ్చ స్టార్ట్ అయింది.
Off The Record: రాజమండ్రి అర్బన్ టిక్కెట్ వ్యవహారం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ అవుతోందట. ఈసారి కూడా సీటు తమ కుటుంబానికే ఖరారు చేశారని ఇటీవల సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చేసిన ప్రకటనే ఇందుకు కారణమట. పనిలో పనిగా తన కుమారుడు వాసు ఈసారి పోటీలో ఉంటారని కూడా క్లారిటీ ఇచ్చేశారట ఆయన. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్తే వాసు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారాయన. వాళ్ళు…
కలకలం సృష్టించిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యవహారం టీ కప్పులో తుఫాన్‌లా ముగిసింది… అసంతృప్తితో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బుచ్చయ్య చౌదరి గత నెలలో సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. దీంతో బుచ్చయ్య చౌదరితో తెలుగుదేశం నాయకత్వం సంప్రదింపులు జరిపింది. తాజాగా పార్టీ అధినేత చంద్రబాతో భేటీ అయ్యారు బుచ్చయ్య చౌదరి.. దీంతో.. బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారానికి పులిస్టాప్ పడిపోయింది.. ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన బుచ్చయ్య చౌదరి.. వైసీపీ…