విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది.. రెండు రోజుల ముందే నగరానికి పండుగ శోభ సంతరించుకుంది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వటంతో విజయవాడ మీదుగా భారీగా ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది.
దసరా పండుగ సందర్భంగా విజయవాడ సందడిగా మారింది. రాష్ట్రం నుంచి దసరాకు వెళ్లే ప్రయాణికులు ఇంటి బాట పడతుండటంతో బస్సులు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. రాష్ట్రం నుంచి తమ సొంతూర్లకు ప్రజలు భారీగా తరలివెళుతున్నారు. దీంతో.. బెజవాడ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది.
రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రాణ ప్రతిష్టాపన చేసే కార్యక్రమం కోసం ప్రపంచం మొత్తం వేచి ఉంది. దీంతో అయోధ్యకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులతో రైల్వే స్టేషన్, విమానాశ్రయంతో పాటు బస్టాండ్ నుంచి రామ మందిరానికి చేరుకుంటున్నారు.