భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సిబ్బంది బుచ్ విల్మోర్‌తో కూడిన బోయింగ్ స్టార్‌లైనర్ గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) సురక్షితంగా చేరుకుంది. 59 ఏళ్ల వ్యోమగామి తన తొలి మిషన్‌లో అనుభవం లేని నూతన సిబ్బందితో అంతరిక్ష నౌకను ఎగుర వేసి పరీక్షించిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు.