దీపావళి పండుగ సమయంలో పటాకులు, దీపాల వినియోగిస్తుంటాం. ఈ సమయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మంటలు లేదా అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు. కాబట్టి, ఈ సందర్భంగా జాగ్రత్తల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. అంతే కాదు.. ప్రమాద తీవ్రతను తగ్గించడానికి కాలిన గాయాలకు ప్రథమ చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండటం కూడా అవసరం.