Bulldozers roadshow: రాజస్థాన్ చివరి రోజు ప్రచారం హోరెత్తింది. ఈ నెల 25న రాష్ట్రంలోని 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారానికి ఈ రోజే చివరి రోజు కావడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు జోరుగా ప్రచారం సాగించారు. గురువారం చిత్తోర్‌గఢ్ జిల్లాలోని నింబహెరా, రాజ్ సమంద్ జిల్లాల్లో నాథ్‌ద్వారాలో కేంద్రహోంమంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేలు కూడా జైపూర్‌లోని వివిధ…