ఏపీకి జీవనాధారం అయిన పోలవరం ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తిచేయాలని, అంచనా వ్యయాన్ని ఆమోదించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. రెండున్నర గంటలపాటు కొనసాగిన సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని విజయసాయి రెడ్డి తెలిపారు. గత పర్యటన సందర్బంగా ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి ఇచ్చిన వినతిపత్రం లోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించాం. పరిష్కార మార్గాలను అన్వేషించాం. సమావేశం చాలా సానుకూలంగా జరిగింది. త్వరలోనే కేంద్రం నుంచి మంచి సమాచారం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కేంద్ర…