టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న నిరాహార దీక్షను భగ్నం చేశారు పోలీసులు.. ఉత్తరాంధ్ర ప్రజా సమస్యలపై పోరాటం కోసమంటూ బుద్దా వెంకన్న బయలుదేరగా.. పోలీసులను ఆయన్ని అడ్డుకున్న విషయం తెలిసిందే.. దానికి నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు వెంకన్న.. ఉత్తరాంధ్రలో టీడీపీ నాయకులు పోరాడితే వైసీపీ నేతల దోపిడి బయటపడుతుంది అనే భయంతో.. ఇలా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.. అయితే, తన నివాసంలోనే నిరాహార దీక్షకు దిగిన బుద్దా వెంకన్నను అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించారు పోలీసులు..…