ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప ది రైజ్’ మూవీ మరో ఐదు రోజుల్లో థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే ఈ సినిమా దర్శకుడు సుకుమార్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు, ముఖ్య అతిథులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాన్ ఇండియా లెవల్లో తీసిన ఈ సినిమా ఈవెంట్‌కు దర్శకుడు హాజరుకాకపోవడంతో ఏదైనా పెద్ద కారణం ఉందా అని…