తెలుగు సినీ రచయిత కోన వెంకట్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనేక సినిమాలకు ఆయన అందించిన కథలు బాగా సెట్ కావడంతో సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే చివరిగా అంజలితో గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా కథ అందించడంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు ఆయన. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఎన్టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బాద్షా సినిమా సమయంలో తాను రైటర్గా డిసప్పాయింట్ కాలేదని…