బీఆర్ఎస్ లో చేరుతున్న నాయకులపై అమ్ముడు పోయారని బీజేపీ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలన్నీ పనికి మాలినవని ఏనుగులు పోతుంటే కుక్కలు చాలా మొరుగుతాయని వాటిని పట్టించుకోకూడది మంత్రి తలసాని అన్నారు. మాటెత్తితే జైశ్రీరామ్ అనే మీరు అదే శ్రీరాముడుపై ఒట్టేసి మీరు చేస్తున్న ఆరోపణలు రుజువు చేసుకుంటారా అని సవాల్ చేశారు.
గజ్వేల్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై పై మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలు అనగానే చాలా మంది వచ్చి ఏదేదో మాట్లాడతారు.. మనల్ని మభ్య పెడతారు.. నవంబర్ 30 తరువాత గజ్వేల్ లో ఎవరు ఉండరు అని ఆయన పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు.. నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు, నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇయ్యు, నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు, నిన్న ( బుధవారం ) మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది
ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. గజ్వేల్ నాకు కొత్త కాదు..మీతో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది.. నేను గజ్వేల్ వచ్చింది నాకు నియోజకవర్గం లేక కాదు.. 20 సంవత్సరాలు నాతో పని చేయించుకుని నా మెడలు పట్టుకుని బయటికి గెంటేశారు అని ఆయన ఆరోపించారు.
నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటాం అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హేమా హేమీలకు ఓటమి తప్పదు.. ఎన్నికల్లో ఓడిపోయిన కవితకు మా గురించి మాట్లాడే అర్హత లేదు అని ధర్మపురి అర్వింద్ అన్నారు.
కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పై తారురోడ్డు డ్యామేజీ కావడంతో.. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్ రెడ్డిలు కేబుల్ బ్రిడ్జ్ నాణ్యతని పరిశీలించారు.
Amith Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణకు రానున్నారు. రాత్రికి అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు.
CM KCR: బీఆర్ఎస్ అధినేత త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పర్యటించనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
బీజేపీ- బీఆర్ఎస్ల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ పెండ్లి కార్డు విడుదల చేసింది. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోశ అంటూ కార్డులో కాంగ్రెస్ పేర్కొంది. కేసీఆర్ ఫాంహౌజ్‌లో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల పెండ్లి అంటూ వివాహ పత్రిక విడుదల చేసింది.