Off The Record: తెలంగాణ రాజకీయం మొత్తం… ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలకు ఇది చావో రేవో అన్నట్టుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా…సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్, అధికార బలం చూపించాలని కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్ అయితే… సిట్టింగ్ సీట్ అనేకాకుండా… ఈ ఉప ఎన్నికలో గెలిస్తే… తిరిగి తమ బలం పెరిగిందన్న సంకేతాలు పంపడంతో పాటు వలసలు, కేడర్‌లో మనోధైర్యం నింపడం లాంటి చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని భావిస్తోందట.…