బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అత్యంత ఘాటుగా స్పందించారు. కవిత మాటలు బీఆర్ఎస్ పార్టీకి పెను ఇబ్బందిగా మారాయని, ఆమె ఎవరో వెనుక ఉండి ఆడిస్తుంటే కీలుబొమ్మగా మారి ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కేసీఆర్ గారిని కంటతడి పెట్టిస్తూ, ఆయనను మానసిక క్షోభకు గురి చేస్తున్న వైనాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సునీత స్పష్టం చేశారు.…