అభిమానులందు.. ఈ అభిమాని వేరయ.. అనేలా ఉంటుంది బండ్ల గణేష్ అభిమానం. ఎందుకంటే.. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్లన్న ఇచ్చిన స్పీచ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. అసలు పవర్ స్టార్, బండ్ల గణేష్ ఈ ఇద్దరి గురించి చర్చ వస్తే.. ముందుగా ఈ స్పీచ్‌నే గుర్తుకు వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. పవన్ అంటే బండ్లన్నకు దైవంతో సమానం. ఒక్కసారి బండ్లన్నకు పవన్ పూనుకుంటే చాలు..…
మరో రెండు రోజుల్లో వింటేజ్ పవర్ స్టార్‌ని చూసి.. ఫ్యాన్స్ కాదు, థియేటర్ స్క్రీన్సే విజిల్స్ వేసేలా ఉన్నాయి. భీమ్లా నాయక్ తర్వాత దాదాపు ఏడాదిన్నర తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా బ్రో. ఈ గ్యాప్‌ను ఫుల్ ఫిల్ చేసేందుకు వింటేజ్ పవర్ స్టార్‌తో కలిసి.. ఒక అభిమానిగా రచ్చ చేయబోతున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే రిలీజ్ అయిన బ్రో ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పవన్ వింటేజ్ స్టైల్…
నిన్న మొన్నటి వరకు బ్రో ప్రమోషన్స్ కాస్త స్లోగా సాగాయి. కానీ ఈ రోజు నుంచి బ్రో హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లనుంది. బ్రో ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. వైజాగ్ ‘జగదాంబ’, హైదరాబాద్ ‘దేవి’ థియేటర్లలో ఒకేసారి గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఇక్కడి నుంచి బ్రో సినిమాకు మరింత హైప్ రానుంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు బ్రో మూవీ నుంచి రెండు పాటలు, ఓ టీజర్ మాత్రమే…
సంక్రాంతి, శివరాత్రి, దసరా, దీపావళి పండగలని ఎంత గొప్పగా చేసుకుంటారో అంతే గొప్పగా పవన్ సినిమా రిలీజ్ రోజుని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు మెగా ఫాన్స్. ఆయన ఫాన్స్ కాకుండా కల్ట్స్ ఉంటారు అనే మాట వినిపించడానికి ఇది కూడా ఒక కారణమే. పవన్ కళ్యాణ్ ఎవరితో సినిమా చేస్తున్నాడు, ఎలాంటి సినిమా చేస్తున్నాడు అనే విషయాలతో సంబంధం లేకుండా పవన్ నుంచి సినిమా వస్తే చాలు అనుకునే ఫాన్స్… రిలీజ్ రోజున థియేటర్స్ దగ్గర హంగామా…
ప్రస్తుతం పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో వరుస సినిమాలు చేస్తూ ఫాన్స్ కి కూడా ఖుషి చేస్తున్నాడు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, బ్రో సినిమాలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్నాయి. వీటిలో లాస్ట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యి అన్నింటికంటే ముందుగా ‘బ్రో’ మూవీ థియేటర్లోకి రాబోతోంది. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ‘బ్రో’ మూవీలో సాయి ధరమ్ తేజ్ మరో లీడ్…