సినిమా కన్ను తెరచింది ఫ్రెంచ్ దేశంలో అయినా, చలనచిత్రాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత నిస్సందేహంగా అమెరికాకే దక్కుతుంది. మొదటి నుంచీ సినిమాను, అందుకు సంబంధించిన విభాగాలనూ అమెరికా ప్రోత్సహిస్తూ వచ్చింది. అందులో భాగంగానే 1929 మే 16న ఆస్కార్ అవార్డులుగా జగద్విఖ్యాతి గాంచిన 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్'ను ఏర్పాటు చేసింది.