అజ్లాన్ షా పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్. అతనికి వరిష అనే యువతితో వివాహమైంది. అజ్లాన్ జంతువులను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో పెళ్లి సందర్భంగా భార్యకు గాడిదను బహుమతిగా ఇచ్చాడు. యువతికి గాడిదలు అంటే చాలా ఇష్టం కాబట్టి.. అవి ప్రపంచంలోనే అత్యంత కష్టపడి పనిచేసే, ప్రేమించదగిన జంతువులనే కారణంతో వాటిని తనకు ఇచ్చానని అజ్లాన్ చెప్పాడు.