ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా ఈ రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా శాస్త్రవేత్తలు ఒకే డోస్‌తో బ్రెస్ట్ క్యాన్సర్ ట్యూమర్‌లను తొలగించవచ్చని పేర్కొన్నారు. దీంతో ఒక్క డోస్‌తో ఈ వ్యాధికి చికిత్స చేయాలనే ఆశ పెరిగింది. యుఎస్‌లోని అర్బానా-ఛాంపెయిన్‌లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ERSO-TFPY అనే అణువు యొక్క మోతాదును అభివృద్ధి చేశారు.