నెహ్రూ నుండి మొదలు పెడితే రాజీవ్ గాంధీ వరకు ఓబీసీ లకి, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా మోడీ కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ఎండగట్టారన్నారు. బీసీల ప్రయోజనాలను నెహ్రూ ఫ్యామిలీ అణచివేసిందని ఆయన మండిపడ్డారు. మోడీ ప్రశ్నలకి రాహుల్ గాంధీ తో సహా ఎవరు సమాధానం చెప్పలేదని, కాంగ్రెస్ అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎస్సీ ఓట్ల కోసం తాపత్రయ…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉందని, ఆయన తెలుగులో మాట్లాడకుండా.. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని, ఆయన మాట్లడేది మాకే అర్ధం కావడం లేదు, తెలంగాణ ప్రజలకు ఏం అర్ధంమౌతుందని ఆయన ప్రశ్నించారు. Siren: ఫిబ్రవరి 23న తెలుగులో జయం…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. హరీష్, కడియం లాగా.. మేము జి హుజూర్ బ్యాచ్ కాదన్నారు. కడియం, హరీష్ లు మమ్మల్ని చిల్చాలను గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారని, మేము పదవుల కోసం కాదు.. ప్రజల కోసం ఉండేవాళ్ళమన్నారు. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలని ఆయన హితవు పలికారు.…
కృష్ణా జలాలపై రేపు అసెంబ్లీలో క్లారిటీ ఇస్తామన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు అసెంబ్లీలో మా ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. ఎల్లుండి కేసీఆర్ మీటింగ్ స్టార్ట్ అయ్యే లోపు తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్తామని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నీళ్లను జగన్ కోసం ఏపీకి తరలించారని, సెంటిమెంట్ వాడుకుందామంటే ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఏపీకి నీళ్ల విషయంలో కేసీఆర్ సహాయం చేశారని జగన్ అసెంబ్లీ లో చెప్పారని, కేసీఆర్…
సంగారెడ్డి జిల్లాలోని కంకోల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)ని దసరా నాటికి పూర్తి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మునిపల్లి మండలం కంకోల్లో పిహెచ్సికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ.. 8నెలల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించి పిహెచ్సిని నిర్వహిస్తామన్నారు. అందోలు నియోజకవర్గం పరిధిలోని మునిపల్లి మండలంలో పర్యటించిన మంత్రి పెద్ద చెల్మడ గ్రామంలో రూ.4.35 కోట్లతో నూతన జిల్లా…
రాష్ట్ర అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కేటాయింపులు చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2024-25 బడ్జెట్లో రూ.4,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ బడ్జెట్లో కేవలం రూ.2,200 కోట్లు కేటాయించిందని హరీష్ రావు గుర్తు చేశారు. ఆదివారం సిద్దిపేట నుంచి ఉమ్రా యాత్రకు వెళ్తున్న ముస్లింలకు హరీష్ రావు పంపిణీ చేస్తూ.. తన సొంత ఖర్చులతో ఏటా 10 మంది పేద ముస్లింలను…
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఎలుకలు కొరికిన ఘటన సంచలనం రేపింది. రోగి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లో చికిత్స పొందుతున్నాడు. కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచిన షేక్ ముజీబ్ చేతులు, కాళ్లపై ఎలుకలు కొరికాయి. రక్తపోటు సంబంధిత సమస్యలతో వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఎలుకలు కుట్టడంతో చేతులు, కాళ్ల నుంచి రక్తం కారుతున్నట్లు బంధువులు…
అయోధ్య రామాలయాన్ని బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కే కేశవరావు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాముడిని రాజకీయం చేశారని, ప్రజా సమస్యలు పక్కన పెట్టి అయోధ్య గురించి పార్లమెంట్ లో చర్చ పెట్టి తీర్మానం చేశారన్నారు. అయోధ్య రామాలయంపై పార్లమెంట్ లో తీర్మనం చేయడం తప్పు.. వ్యతిరేకిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కానీ సభాపతి అధికారం ఉంటుంది కాబట్టి చేశారని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రామలయాన్ని రాజకీయం చేస్తున్నారని,…
ఈ నెల 20 నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పోస్టర్ను అవిస్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి దేశ వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో సానుకూల వాతావరణం ఉందన్నారు. ప్రజలు నరేంద్ర మోడీకి కమలం పువ్వుకే ఓటేసెందుకు ముందే నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణ లో బీజేపీ అన్ని స్థానాలకు పోటీ చేయబోతున్నామన్నారు. తెలంగాణ ప్రజల మద్దతు, ఆశీస్సుల కోసం 5…