KTR : ఉత్తమ్ మాట్లాడేది మాకే అర్థం కాలేదు.. ప్రజలకు ఏం అర్ధంమౌతుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉందని, ఆయన తెలుగులో మాట్లాడకుండా.. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని, ఆయన మాట్లడేది మాకే అర్ధం కావడం లేదు, తెలంగాణ ప్రజలకు ఏం అర్ధంమౌతుందని ఆయన ప్రశ్నించారు.
Siren: ఫిబ్రవరి 23న తెలుగులో జయం రవి ‘సైరన్’
Also Read
ఇదిలా ఉంటే.. కృష్టా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించబోమంటూ తెలంగాణ అసెంబ్లీలో సోమవారం కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని ప్రవేశపెట్టడంపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. బీఆర్ఎస్ తలపెట్టిన ‘ఛలో నల్గొండ ఎఫెక్ట్!’ కారణంగా అధికార పార్టీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతోందని వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సాధించిన తొలి విజయం ఇదని ఆయన అభివర్ణించారు. కృష్ణా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించడానికి నిరసనగా రేపు (మంగళవారం) నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ‘ఛలో నల్గొండ’ ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతోందన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తీర్మానాన్ని ప్రవేశపెట్టనుందని కేటీఆర్ ప్రస్తావించారు. ఈ ట్వీట్‌కు మాజీ సీఎం కేసీఆర్ ఫొటోని కేటీఆర్ జోడించారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!