నేడు కాకినాడ జిల్లాలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం అచ్చంపేట జంక్షన్లో బహిరంగ సభ నిర్వహించనుండగా.. ఆ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం వైఎస్ జగన్ గురువారం రాత్రి బస చేసిన ఎస్టీ రాజపురం ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా…
ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో నేడు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగా ఎన్టీవీ జర్నలిస్టులు వేసిన ప్రశ్నలకు సమాధానంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు ఏదీ శాశ్వతం కాదు. పత్రిపక్షంలో ఉన్నవాళ్లు అధికారంలోకి వస్తారని ఆయన వ్యాఖ్యానించారు. మా పార్టీ పుట్టింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయడమని ఆయన అన్నారు. మేం అధికారంలోకి వచ్చాక కరెంట్ సమస్యలు పరిష్కరించామన్న హరీష్…
శ్రీరామనవమి సందర్భంగా నా చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో పలు పట్టణాల్లో సీతారాముల కళ్యాణం మహోత్సవంలో నేను నా కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. పరిగి పట్టణంలోని మండలం కేంద్రంలోని దాసాంజనేయ స్వామి ఆలయం, గండీవీడ్ మండలం వెన్నా చెడ్ గ్రామంలో రామస్వామి దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం తాండూర్ నియోజకవర్గం లోని యాలాల్ మండలం జంటుపల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని శంషాబాద్ మండలం…
గన్నవరం నియోజవర్గంలో అన్ని వర్గాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని గన్నవరం నియోజవర్గ టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. గన్నవరం రోటరీ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం జరిగిన రజక సంఘం ఆత్మీయ సమావేశం పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నవరం నియోజవర్గంలోని రజకుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో రజకచెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. పోలవరం కాలవ పై శాశ్వతంగా మోటార్లు…
నా కుమారుడు రాహిల్‌ను కేసుల్లో ఇరికించేందుకు వెస్ట్ జోన్ డీసీసీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. ఎమ్మెల్యే షకీల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. నా కుమారుడి తప్పు వుంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటానన్నారు. నా కుమారుడు రాహిల్ చేయని తప్పుకు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడి ప్రమేయం లేదన్నారు. దీనిపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలన్నారు షకీల్. కేసు ట్రయల్…
అధికార వైసీపీ పార్టీపై గుంటూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. ఉన్మాదికి అధికారం ఇస్తే ఎలాంటి విధ్వంసం జరుగుతుందనేందుకు అమరావతి ప్రత్యక్ష ఉదాహరణ అని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని ప్రాంతంలో ఆయన ఇవాళ పర్యటించి అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలను, జరిగిన విధ్వంసాన్ని పరిశీలించారు. ఉద్దండరాయినిపాలెంలో అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతం, ప్రజాప్రతినిధులు అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలు, సెక్రటేరియట్ కాంప్లెక్స్, అంబేద్కర్ స్మృతివనం ప్రాంతాలను…
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా .. ‘తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3 వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన పాలమూరు బిడ్డ అనన్య రెడ్డి కి ప్రత్యేక అభినందనలు. వరుసగా రెండోసారి తెలంగాణ బిడ్డకు జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ రావటం చాలా సంతోషానిస్తోంది. వందలోపు…
శ్రీ రామ నవమి సందర్భంగా ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ దేవాలయాల్లో నిర్వహించిన శ్రీ సీతా రాములు కళ్యాణ వేడుకల్లో బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా శ్రీ రామ నవమి వేడుకలు జరుగుతున్నాయని, ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం తరువాత మొదటి శ్రీ రామ నవమి కావడం విశేషమన్నారు. ప్రతి గ్రామంలో అందరూ శ్రీ రాముని కళ్యాణం ఎంతో…
తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన ఎములాడ (వేములవాడ) రాజన్న సన్నిధిలో శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ సీతరాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.శ్రీ రాములోరి కళ్యాణ ఘట్టం తిలికించడానికి తెలంగాణ జిల్లాలతో పాటు అంధ్రప్రదేశ్, మహరాష్ర్ట, తదితర ప్రాంతాల నుండి సుమారు లక్ష మంది భక్తులు, శివ పార్వతులు, జోగినిలు, హిజ్రలు హజరయ్యారు.. ఉదయమే శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతరామచంద్రమూర్తికి పంచోపనిషత్తు ద్వార అభిషేకాలు నిర్వహించారు.…
సోషల్ మీడియా వేదిక రేగా కాంతారావు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ప్రజలకు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చక పోతే వదిలిపెట్టమన్నారు రేగా కాంతా రావు. కానీ రేవంత్ ప్రభుత్వానికి ఎంపీ ఎన్నికల్లో ప్రజా తిరుగుబాటు తప్పదని, ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఏ పరిస్థితులు సంభవిస్తాయో అని ప్రజల్లో చర్చ ఉందన్నారు. ఖమ్మం, నల్గొండ మానవ బాంబులతో ప్రమాదం ఉంది ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు రేగా కాంతా…