రేవంత్ రెడ్డి మతిస్థిమితం కొల్పోయాడా…. గజినిగా మారాడా అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త అంశాలను తెరమీదకు తీసుకు వస్తున్నారని, కాళేశ్వరం పోయింది పోన్ ట్యాపింగ్ వచ్చింది… పోన్ ట్యాపింగ్ పోయి మరో అంశం తెరపైకి తెచ్చారన్నారు మహేశ్వర్ రెడ్డి. రెఫరెండం అన్నావు 14 సీట్లు గెలుస్తామని అన్నావు… 14 గెలిస్తే నేను రాజీనామా చేస్తా అన్న మీరు స్పందించలేదని, రేవంత్ రెడ్డి, హరీష్ రావు లు కలిసి…
లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాదిగలు అందరూ కృషి చేస్తారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పాపయ్య మాదిగ అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా కేటాయించలేదని… ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటి అయ్యి చర్చించామని పాపయ్య మాదిగ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
నేతన్నలు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు,ఎలాంటి కష్టం వచ్చినా ప్రభుత్వాన్ని సంప్రదించండని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇవాళ ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాట్లాడుతూ.. ప్రభుత్వం జి.ఓ.నెం.1 లో నేతన్నలకు పాలసి తీసుకువస్తోందని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల కన్నా అధిక ఆర్డర్లు ఇచ్చి అధిక సంపాదన వచ్చేటట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెక్స్టైల్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతన్నల ఉపాధి కొరకు సానుకూలంగా ఉన్నారని, గత ప్రభుత్వం చేసిన అప్పులను చక్క…
రాహుల్ గాంధీ జోడో యాత్రలో జనాభా దామాషా ప్రకారం మా రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ.. ఓబీసీ నేతలు అడిగారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎంత జనాభా ఉంటే..అంత రిజర్వేషన్లు ఇస్తాం అన్నది మా విధానమన్నారు. 1925 లో ఆర్ఎస్ఎస్ మొదలు పెట్టినప్పుడు రేసేర్వేషన్ లు లేని దేశం చేస్తాం అన్నారని, ఈస్ట్ ఇండియా కంపెనీ ..సముద్రం పక్కన సంసారం మొదలు పెట్టిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా సూరత్ నుండి ఆధాని…
మాట మాట్లాడితే హరీష్ రావు దిగిపో అంటున్నారు.. రాజీనామాలు అంటున్నారని మంత్రి సీతక్క హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ ఆమె కొమురం భీం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు పదవి కాంక్ష ఏంటో తెలిసిందని, 2018 ఎన్నికల్లో కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారన్నారు. చాలామందికి నువ్వు డబ్బులు ఇచ్చావని నీకు పదవి ఇవ్వకుండా ఆపారని, అప్పుడు ఎక్ నాథ్ షిండే లాగా నువ్వు వ్యవహరించవని నీకు పదవి ఇవ్వకుండా ఆపారంట.. ఇవి అప్పట్లో వార్తలు…
ఉపాధి హామీ పథకం పేదలకు అన్నం పెట్టిందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామంలో నే జీవనోపాధి కలిపించిన పథకం తెచ్చింది సోనియా గాంధీ అని, ఉపాధి హామీతో గ్రామాభివృద్ధి.. జీవనోపాధి కల్పించినది సోనియమ్మ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ.. పాండవులు వనవాసం వెళ్ళినప్పుడు భోజనము పెట్టిన అక్షయ పాత్ర ఎట్లనో ఉపాది హామీ పథకం కూడా పేదలకు అక్షయ పాత్ర లాంటిదని, అలాంటి పేదల పథకం మోడీ పక్కన…
హరీష్ రావు డ్రామా రావుగా మారారని కడియం శ్రీహరి విమర్శించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. మొదట సవాల్ చేసింది హరీష్ రావే ఆ సవాలను స్వీకరించింది సీఎం రేవంత్ రెడ్డి అని, పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుద్దామంటూ సీఎం ప్రకటన చేస్తే.. రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు రాజీనామా కట్టుబడి ఉండాలన్నారు. కానీ.. రుణమాఫీపై రాజీనామా చేస్తున్నటువంటి హరీష్ రావు ఆ తర్వాత మాట మార్చారని, రుణమాఫీ తో…
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మెజారిటీ ఇచ్చిన మండలం మాచారెడ్డి అని, మీరు ఆశీర్వదిస్తే కామారెడ్డి నియోజక వర్గంకి త్రాగు సాగు నీరు తెప్పిస్తానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల పథకం నిలిపేసింది… లేకుంటే మచారెడ్డి లో నీళ్ళు వచ్చేవని ఆయన అన్నారు. మోడీ రిజర్వేషన్లు తీసేస్తామంటున్నాడు. దేశ ప్రజలు నష్టపోతారని ఆయన మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలిస్తామని,…
కాంగ్రెస్ దిగజారి ప్రకటనలు చేస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తుందని, ఇటలీకి చెందిన సోనియా గాంధీని దేశ ప్రధాని చేయాలని చూశారన్నారు. మా పార్టీ సోనియా ప్రధాని కావడాన్ని అడ్డుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ మారిందని ఆయన విమర్శించారు. ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ అని, దేశానికి పట్టిన…
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే రాజేందర్ రావు నీ గెలిపించండని ఆయన కోరారు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ హిందువులకు ఎప్పుడైనా అన్యాయం చేసిందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె అదానీ అంబాణీలకు ఇచ్చిన ఆస్తులు గుంజుకొని పేదలకు పంచే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది…