India Republic Day: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ (Kartavya Path)లో ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం మరింత ప్రత్యేకంగా ఉండడంతో త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు…
BrahMos: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ నెలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. 2025 భారత గణతంత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు.
BrahMos: భారత్ తన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కి ఎగుమతి చేయనుంది. ఫిలిప్పీన్స్ ఆర్డర్ చేసిన బ్రహ్మోస్ లాంచర్లను, క్షిపణులను రేపటి నుంచి సరఫరా చేయనుంది.
ఇతర దేశాల నుంచి సేకరించిన పాత క్షిపణి వ్యవస్థల స్థానంలో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి భారత నావికాదళానికి ప్రాథమిక ఆయుధంగా ఉంటుందని భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ సోమవారం తెలిపారు.
రక్షణ శాఖకు అత్యాధునిక ఆయుధాలను తయారు చేసివ్వడంలో అద్భుతమైన ప్రగతి సాధించామని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ పేర్కొన్నారు.
Honey Trap Case: డీఆర్డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వలపువలతో చిక్కుకున్నాడు. ప్రస్తుతం అతడిని అధికారులు విచారిస్తున్నారు. అయితే విచారణలో విస్తూ పోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జరా దాస్‌గుప్తా అనే పేరుతో ప్రదీప్ కురుల్కర్ ను హనీట్రాప్ చేశారు.
Brahmos Misfire: గతేడాది పాకిస్థాన్‌లో అనుకోకుండా బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగించడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.24 కోట్ల నష్టం వాటిల్లడంతో పాటు పొరుగు దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయి.
భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం అయ్యేందుకు ఇటీవల డీఆర్డీఓ, సైన్యం వరసగా క్షిపణి ప్రయోగాలు చేస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన బ్రహ్మోస్, పినాక వంటి క్షిపణులు అనుకున్నట్లుగానే లక్ష్యాలను ఛేదించాయి. తాజాగా మరోసారి భారత రక్షణ వ్యవస్థకు కీలక విజయం లభించింది. ‘బ్రహ్మోస్’ ఎయిర్ లాంచ్ క్షిపణి ఎక్స్ టెండెడ్ రేంజ్ వర్షెన్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్ ఎస్యూ -30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని లాంచ్ చేయగా… బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని…
గురువారం నిర్వహించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని రక్షణ శాఖ తెలిపింది. సముద్రంలో ఉన్న ఓడలు, పడవలు వంటి లక్ష్యాలను ఛేదించేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన యాంటీషిప్ వెర్షన్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు ఇండియన్ నేవీ, అండమాన్ నికోబార్ కమాండ్ వెల్లడించాయి. బ్రహ్మోస్ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించినట్లు తెలిపాయి. ఈ ప్రయోగాన్ని ఇండియన్ నేవీ, అండమాన్ నికోబార్ కమాండ్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ నెల 19న భారత…