Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ దాడికి ప్రతిస్పందించడానికి తమకు కేవలం 30-45 సెకన్ల టైమ్ మాత్రమే ఉందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహాయకుడు రాణా సనావుల్లా అన్నారు. బ్రహ్మోస్ క్షిపణిలో అణు వార్‌హెడ్ ఉంటుందో లేదో తెలుసుకునేందుకు తక్కువ సమయం ఉన్నట్లు ఆయన అంగీకరించారు.