జనం లేక ఈగలు తోలుకుంటున్నారు అన్న సామెతను మనం వింటుంటాం కదా.. ఇప్పుడు ఈ..పెట్రోల్ బంకులో అదే జరుగుతోంది.. కస్టమర్లు లేక వీళ్లు ఇదే పని చేస్తున్నారు.. ఒకళ్లిద్దరు వస్తే అదే మహా భాగ్యమని, దేవుళ్లు వచ్చారని ఫీలవుతున్నారు ఈపెట్రోల్ బంకు నిర్వాహకులు.. పెట్రోల్ ధరల దెబ్బకు ఇక్కడ సీన్ రివర్స్ అయింది.. ఈ ఒక్క బంకే కాదు.. కర్నాటక సరిహద్దు ప్రాంతాలైన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, నియోజకవర్గాల్లోని మెజారిటీ బంకుల పరిస్థితి ఇదే.. తెలంగాణలో…
రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఉక్రెయిన్‌కు మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టగా, ఉక్రెయిన్‌లో రెబల్స్ తిరుగుబాటు దారులు దాడులు చేసేందుకు సిద్దమయ్యారు. ఉక్రెయిన్ అనుకూల వాదులు ముందుగా దాడులకు దిగుతున్నారని, రెబల్స్ పేర్కొంటున్నారు. అయితే, ఉక్రెయిన్ వ్యతిరేకులే దాడులకు దిగుతున్నట్టు చెబుతున్నారు. దాడులకు దిగబోమని రష్యా చెబుతున్నది. కానీ, ఈ మాటలను నమ్మే స్థితిలో ప్రపంచదేశాలు లేవని, ఏ క్షణంలో అయినా రష్యా ట్రిగ్గర్ నొక్కే అవకాశం ఉంటుందని అమెరికా…
చైనా చుట్టుపక్కల దేశాలపై కన్నేసింది. 2025 నాటికి తైవాన్‌ను పూర్తిగా ఆక్రమించుకోవాలని చైనా చూస్తున్నది. దీనికోసం చాలా రోజులుగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇటు ఇండియాలోని లద్ధాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌పై కూడా చైనా కన్నేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నది. బోర్డర్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు ఆ దేశం సిద్దమౌతున్న సంగతి తెలిసిందే. అదీ చాలదన్నట్టు ఇప్పుడు మరో మిత్రదేశం నేపాల్‌పై కూడా చైనా కన్నేసింది. నేపాల్ చైనా మధ్య సుమారు 1400 కిమీ మేర సరిహద్దు…
డ్రాగన్ కంట్రీ చైనాకు పరోక్షంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె… సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశాల సరిహద్దుల వద్ద యథాతథ స్ధితిని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నాన్ని కూడా భారత సైన్యం సఫలం కానివ్వబోదని ప్రకటించారు.. చైనా సరిహద్దుల్లో ఉన్న పరిస్థితిని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. గత ఏడాది భారత సైన్యం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొందన్నారు.. తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులను నియంత్రణలో…
ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు ఉద్రిక్తంగా మారాయి. అసోం, మిజోరం బోర్డర్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు అసోం పోలీసులు చనిపోయినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఎస్పీ సహా 60 మందికి పైగా గాయపడ్డారు. ఇరువైపులా ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. గతేడాది ఆగస్టులో, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సరిహద్దు సమస్యపై ఘర్షణలు జరిగాయి. అవి పునరావృతమయ్యాయి. సరిహద్దులోని 8 వ్యవసాయ పాకలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడమే తాజా ఘర్షణలకు కారణంగా…
ప్రేమించిన యువతి కోసం ఓ యువకుడు దేశ సరిహద్దులు దాటాడు.. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. మళ్లీ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించి బీఎస్ఎఫ్‌కు చిక్కాడు… దేశ సరిహద్దులు దాటిని ఆ లవ్ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా బల్లావ్‌పూర్‌కు చెందిన జైకాంతో చంద్రరాయ్ అనే యువకుడికి బంగ్లాదేశ్‌కు చెందిన పరిణితి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది.. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో.. పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలనుకున్నారు.. ఆ లోచన…
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లాక్‌డౌన్ ను విధించారు. ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్ అమలులో ఉండటంతో తెలంగాణ నుంచి వేలాదిమంది ఏపీకి వెళ్తున్నారు. భారీ సంఖ్యలో వాహనాల్లో ప్రజలు తరలి వెళ్తున్నారు. ఏపీలో మద్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ అమలులో ఉండటంతో 12 గంటలలోగా సొంత ప్రాంతలకు చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తరువాత లాక్‌డౌన్ అమలులో ఉంటుంది కాబట్టి ఉదయం 10 గంటల తరువాత వాహనాల రాకపోకలు…
కర్ణాటకలో ప్రస్తుతం లాక్‌డౌన్ కోనసాగుతోంది. ఈరోజు నుంచి మే 24 వరకు లాక్‌డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని దేవసుగుర్ చెక్‌పోస్ట్ దగ్గర కర్ణాటక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్యం,నిత్యవసర సరుకుల వాహనాలను మాత్రమే కర్ణాటకలోకి అనుమతిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కర్ణాటకలో రోజువారి కరోనా కేసులు 40 వేలకు పైగా నమోదవుతుండటంతో రెండు వారాలపాటు సంపూర్ణలాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. లాక్ డౌన్…