మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనాల పండుగలో గ్రూప్ రాజకీయాలు సృష్టించొద్దని, ఎవరైనా గొడవలకు దిగితే సహించేదిలేదని హెచ్చరించారు. ఈనేపథ్యంలో.. హైదరాబాద్ పాతబస్తీ సుల్తాన్ షాహీ శ్రీ జగదాంబ అమ్మవారి దేవాలయం వద్ద ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీతో పాటు పాతబస్తీ పరిధిలో ఉన్న ఇతర దేవాలయాలకు బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వ తరఫున మంత్రి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రైవేటు దేవాలయాలకు సైతం ఆర్థిక సహాయం అందించిన ఘనత తెలంగాణ…