Ravi Shankar Birthday: నటుడు రవిశంకర్ అంటే చప్పున గుర్తుకు రాకపోవచ్చు. కానీ ‘బొమ్మాళీ… నిన్నొదల..’ అంటూ ఆయన గళం చేసిన మాయాజాలాన్ని జనం ఎప్పటికీ మరచిపోలేరు. అన్న సాయికుమార్, తండ్రి పి.జె.శర్మ చూపిన బాటలోనే పయనిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రవిశంకర్. ఆయన గళవిన్యాసాలతో పలు చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అనువాద చిత్రాలలో ప్రతినాయకులకు రవిశంకర్ గళం ప్రాణం పోసిందనే చెప్పాలి. పూడిపెద్ది రవిశంకర్ 1966 నవంబర్ 28న మద్రాసులో జన్మించారు. ఆయన…