స్వాతంత్య్ర దినోత్సవం దగ్గరపడుతున్న తరుణంలో బెదిరింపు సందేశాలు కలకలం రేపాయి. పాక్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం అని గోడలపై బెదిరింపు మెసేజ్ లు ఆందోళనకు గురిచేశాయి. బెంగళూరులో ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక హౌసింగ్ సొసైటీ గోడపై రాసిన బెదిరింపు సందేశం సంచలనం సృష్టించింది. గోడపై “పాకిస్తాన్ నుంచి భారతదేశాన్ని పేల్చివేస్తాం” అని రాసి ఉంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే, ఆ ప్రాంతంలో భయాందోళనలు చెలరేగాయి.…