ఏపీలో వంటనూనెల ధరలు సామాన్యులను ఠారెత్తిస్తున్నాయి. వ్యాపారులు ఉక్రెయిన్ యుద్ధం వంక పెట్టి ధరలు పెంచేస్తున్నారు. వంట నూనెల ధరల నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీర్ శర్మ సమీక్ష చేపట్టారు. వంట నూనెల ధరల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశాలిచ్చారు. వంట నూనెల ధరల పెరుగుదల నియంత్రణకు కలెక్టర్లు, జేసీలు, పౌరసరఫరాలు, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తదితర విభాగాల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో హోల్…