అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఓ విద్యాకేంద్రం వద్ద భారీ పేలుడు సంభవించింది.
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో పది మంది మృతిచెందారు. ఈ పేలుడులో ఇద్దరు రష్యా రాయబార కార్యాలయ సిబ్బంది మరణించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 8 మంది గాయపడినట్లు సమాచారం.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని షియా నివాస ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఘోర పేలుడుకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ పేలుడులో కనీసం ఎనిమిది మంది మరణించారని, 18 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.