ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చాక పరిస్థితులు మెల్లిగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వెంటనే... రకరకాల విశ్లేషణలు జరిగాయి. అయితే... ఓవరాల్‌గా ఆయన టీడీపీని వ్యతిరేకించే వ్యక్తి కాదని, కూటమి ప్రయాణం కూడా సాఫీగానే సాగుతుందని లెక్కలేశారు. అయితే... టైం గడిచేకొద్దీ.... ఆయన స్వరం సవరించుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.
పీవీఎన్ మాధవ్ పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. 1973 ఆగష్టు 10వ తేదీన.. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో జన్మించారు. మాధవ్ ఉన్నత విద్యావంతుడు. కాస్ట్ అకౌంటెంట్ కోర్సు చేశారు. తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో MBA చదివారు. ఏకకాలంలో PGDCS, PGDAS పూర్తి చేశారు.