బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆదివారం అభ్యర్థిని ఖరారు చేయాలని అధిష్టానం భావిస్తోంది.
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ప్రధాని మోడీతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.