Nitin Nabin: బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబిన్‌ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో ఈ నియామకానికి పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. నబిన్ ప్రస్తుతం, బీహార్‌లో నితీష్ కుమాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన రహదారుల నిర్మాణ శాఖను చూస్తున్నారు.