జమిలి ఎన్నికలు రావాలని కోరుకుంటున్నామని బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ మెంబర్ డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టేందుకు కేసీఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని కోరారు.
BJP MP Laxman: 8 ఏళ్ల నుంచి గిరిజనులకు 10 % రిజర్వేషన్లు జీవో ఎందుకు ఇవ్వలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. గిరిజనుల రిజర్వేషన్లపై కేసీఆర్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. కాగా.. బీజేపీ స్టేట్ ఆఫీసులో మోడీ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే జీవోలన్నింటికి కేంద్రం ఆమోదం ఉందా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఎన్టీఆర్ హయాంలో ఒక్క జీవోతో రిజర్వేషన్లు పెంచారని…