బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీలో వైసీపీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టుకుని రాష్ట్ర పథకాలుగా జగన్ సర్కారు ప్రచారం చేసుకుంటోందని జీవీఎల్ మండిపడ్డారు. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత కేంద్రం నుంచి అత్యధిక నిధులు పొందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని జీవీఎల్ వెల్లడించారు. అయినా ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా వైఫల్యం చెందుతోందని ఆయన విమర్శలు చేశారు. Read Also: రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు కేంద్ర పథకాలు అమలు…
ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించే దిశా కమిటీలో తనకు స్థానం కల్పించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. దిశా కమిటీలో ‘ప్రముఖ సభ్యుడు’ (ఎమినెంట్ మెంబర్)గా తనను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నియమించిందని, ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఈ కమిటీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు సరిగ్గా జరిగే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో గత రెండున్నరేళ్లలో అభివృద్ది అనేది కనిపించటం లేదు. అప్పులేనిదే పూట గడవని పరిస్తితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అప్పుతెచ్చుకోవడం, అరువు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్‌డీ చేసింది. అప్పుల నుడి బయటపడేందుకు ఏదైనా ఆలోచిస్తుంది అంటే అదేమి లేదు…ప్రజలపై భారం మాత్రమే వేస్తుంది. కేంద్ర ప్రభుత్వ పతకాలను నీరు కర్చే విధంగా ఏవేవో అదేసాలిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కేంద్రం చెపట్టేవి తప్ప రాష్ట్ర ప్రభుత్వం…