బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో తాము భయాందోళనకు గురయ్యామని ఆమె వాపోయారు. ఈ ఘటనపై అలర్ట్ అయిన పోలీసులు ఆగంతుకుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదుపులో ఉన్న వ్యక్తి ఢిల్లీకి చెందిన అక్రమ్ గా పోలీసులు గుర్తించారు. గతంలో ఢిల్లీతోపాటు పాతబస్తీలోను చోరీలు చేసినట్లు సమాచారం. పశ్చిమ మండల డీసీపీ…
ఎంపీ డీకే ఆరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై డీకే అరుణ మాట్లాడుతూ.. గత 38 ఏళ్లుగా నేను ఇదే ఇంట్లో ఉంటున్నాను.. ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. అగంతకుడు వచ్చిన సమయంలో ఇంట్లో మా కూతురు, మనవరాలు ఉంది. ఆ సమయంలో అలజడి విని మా పాప, మనవరాలు లేచి ఉంటే.. ఆ వ్యక్తి దాడికి యత్నించే వాడేమో.. నేను నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ పరంగా ఎన్నో…