ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఓ రిసార్టులో అంకితా బండారీ అనే 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ హత్య ప్రకంపనలు రేపుతోంది. రిసార్టు యజమానే మరో ఇద్దరితో కలిసి రిసెప్షనిస్టును హత్య చేసినట్లు తేలింది. రిసార్టు యజమాని రాష్ట్ర బీజేపీ నేత కొడుకు కావడంతో ఈ ఘటన దేశమంతటా సంచలనంగా మారింది.