జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సెక్స్ స్కాండల్ గురించి తెలిసి కూడా జనతాదళ్ (సెక్యులర్)తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తు పెట్టుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై డీకే శివకుమార్ మంగళవారం ఎదురుదాడికి దిగారు.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ, జేడీఎస్‌లు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలు తనను సంప్రదించారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం ప్రకటించారు. అలాగే కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నట్లు ఆ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
BJP-JDS Alliance: కర్ణాటకలో వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో మరోసారి బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య చర్చలు కూడా నమోదైనట్లు తెలుస్తోంది.
BJP-JDS alliance: కర్ణాటకలో కొత్త రాజకీయ సమీకరణం తెరపైకి వచ్చింది. పాత మిత్రుడు జేడీఎస్, బీజేపీ పంచన చేరబోతోంది. ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ దారుణం దెబ్బతింది. బీజేపీ ఓట్ షేర్ అలాగే ఉన్నా.. జేడీఎస్ ఓట్ షేర్ దారుణంగా పడిపోయింది. జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లడం ఆ పార్టీకి ప్రమాదఘంటికలు మోగించాయి. ఈ నేపథ్యంలో వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న…