BJP- Communist Party Alliance: ఒకప్పుడు బీజేపీకి కమ్యూనిస్టులు అంటే అస్సలు నచ్చేది కాదు.. ఎర్ర జెండాకు వ్యతిరేకంగా, కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఎప్పుడూ తిరస్కరించే పార్టీగా బీజేపీ పేరుగాంచింది. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు చేసిన తాజా వ్యాఖ్యలు ఈ మార్పుకు సంకేతం? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.