మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కలిశారు. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మర్యాదపూర్వకంగా డిప్యూటీ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మాధవ్‌కు పవన్ శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పారు. ఈ భేటీలో ఇద్దరు పలు కీలక రాజకీయ అంశాలపై చర్చించారు. కూటమి కార్యాచరణ, ప్రభుత్వంలో భాగస్వామ్యం, రాజకీయ సమన్వయంపై నేతలు చర్చించారు. జనసేన–బీజేపీ మిత్రపక్షాల మధ్య సమన్వయం పెంచే…
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు పీవీఎన్ మాధవ్... విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా కంటే ముందు అధ్యక్షులైన వారి శక్తి యుక్తులతో ముందుకు వెళ్తాను అన్నారు.. ప్రతీ కార్యకర్త తానే అధ్యక్షుడయ్యానని అన్నంతగా పని చేస్తున్నారు.. రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పలుకుతూ ఒక నిర్ణయాన్నిచ్చారని పేర్కొన్నారు.. బీజేపీ ఇచ్చిన ఈ పదవిని గౌరవంగా భావించి పని చేస్తాను అన్నారు..