ఏడాదిగా మల్కాజ్గిరి పార్లమెంట్‌లో ఈటెల రాజేందర్ చేసిన అభివృద్ధిని వివరించడానికి ఈ సభ ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. 11 ఏళ్లుగా మోడీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 11 ఏళ్లు పరిపాలన చేయడానికి ప్రజలు ఆమోదం తెలిపిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని కొనియాడారు. మరో 11 ఏళ్లు మోడీ పరిపాలన ప్రజలు కోరుకుంటున్నారని.. యూపీఏ ప్రభుత్వంలో ఏ వార్త చూసినా కుంభకోణాలు, అవినీతి…