Amit Shah: జనన, మరణాలకు సంబంధించిన వివరాలను ఓటర్ల జాబితాతో పాటు మొత్తం అభివృద్ధి ప్రక్రియకు అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకురానున్నట్లు యోచిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం తెలిపారు. భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమీషనర్ కార్యాలయం ‘జనగణన భవన్’ని ప్రారంభించిన అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు. జనాభా గణన అనేది అభివృద్ధి ఎజెండాకు ఆధారం అయ్యే ప్రక్రియ అని ఆయన అన్నారు.