బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్, బిగ్ బాస్ నాన్-స్టాప్ కి ఎండ్ కార్డ్ పడుతోంది. ఫైనల్ ఎపిసోడ్ కి రంగం సిద్దం అయింది. ఈ సీజన్ విజేతగా బిందు మాధవి నిలిచినట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4లో రన్నరప్ అయిన అఖిల్ సార్థక్ ఓటీటీ వెర్షన్ లో కూడా అదే స్థానానికి పరిమతం అవటం విశేషం. ఇప్పటి వరకూ తెలుగులో బిగ్ బాస్ విజేతగా మహిళలు ఎవరూ నిలవలేదు. తొలి మహిళా విజేతగా బిందు మాధవి…