Bimbisara Success Press Meet: ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ హీరోగా హరికృష్ణ నిర్మించిన 'బింబిసార' చిత్ర బృందం క్లౌడ్ నైన్ లో ఉంది. తొలి ఆట నుండే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడంతో పలు కేంద్రాలలో థియేటర్లను పెంచుతున్నారు. మార్నింగ్ షో రిపోర్ట్ అందుకున్న వెంటనే చిత్ర బృందం నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో కళ్యాణ్ రామ్ ఈ చిత్ర విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.