Billa Special Show: స్టార్ హీరోల బర్త్ డేన వాళ్ళ సినిమాను స్పెషల్ షోగా ప్రదర్శించే సంప్రదాయం ఒకటి ఈ మధ్య కాలంలో ఊపందుకుంది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే. ఆ సందర్భంగా అతనితో గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేంద్ర నిర్మించిన 'బిల్లా' చిత్రాన్ని దేశ వ్యాప్తంగా ప్రదర్శించబోతున్నారు. జపాన్ తో మొదలు పెట్టి ఈ సినిమాను ఆ రోజు వివిధ దేశాల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దర్శకుడు మెహర్ రమేశ్ తెలిపారు.